కరోనా వ్యాప్తి చెందకుండా పోలీస్‌శాఖలో ముందస్తు జాగ్రత్తలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 10, 2020

కరోనా వ్యాప్తి చెందకుండా పోలీస్‌శాఖలో ముందస్తు జాగ్రత్తలు

రోజురోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీస్‌శాఖలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పోలీసుశాఖలో అనారోగ్యంగా ఉన్న సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.
ఈ విషయంపై సీపీలు, ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే క్వారంటైన్‌లో ఉండాలని డీజీపీ సూచించారు. ఇతరులకు వైరస్‌ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Post Top Ad