వుహాన్‌ను తలపిస్తోన్న ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 07, 2020

వుహాన్‌ను తలపిస్తోన్న ముషీరాబాద్ ఫిష్ మార్కెట్

ముషీరాబాద్ ఫిష్ మార్కెట్. జంటనగరాల్లో అందుబాటులో ఉన్న ఏకైక అతిపెద్ద చేపల మార్కెట్ ఇది. ఈ మార్కెట్‌లో లక్షలాది రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నమోదవుతుంటాయి. ఒకవైపు రామ్‌నగర్, మరోవంక ముషీరాబాద్, ఇంకోపక్క గంగపుత్ర కాలనీ మధ్య ఉంటుంది. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చేపలను కొనుగోలు చేయడానికి వచ్చే వారితో క్రిక్కిరిసి పోతూంటుంది. ఆదివారం రోజు కొనుగోలుదారుల రద్దీ రెట్టింపు అవుతుంటుంది..సహజంగానే.అలాంటిది- మృగశిర కార్తె నాడు ఇంకెంత రద్దీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని వందలాది మంది కొనుగోలుదారులు ముషీరాబాద్ ఫిష్ మార్కెట్‌కు చేరుకున్నారు. ఆదివారం కావడంతో రద్దీ భారీగా కనిపించింది. కిటకిటలాడిపోయిందీ మార్కెట్. సాధారణ రోజుల్లో అయితే ఫర్వాలేదు గానీ.. కరోనా వైరస్ కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫిష్ మార్కెట్ కొనుగోలుదారులతో నిండిపోవడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.
కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన వుహాన్‌లోని హ్యూనన్ ఫిష్ మార్కెట్‌ను తలపించింది. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్‌కు చేపలను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో ఏ ఒక్కరికైనా కరోనా వైరస్ సోకి ఉంటే.. అనే ఊహే భయాన్ని కలిగించేలా కనిపించింది అక్కడి పరిస్థితి. మార్కెట్‌కు వచ్చిన వారిలో చాలామంది కనీస జాగ్రత్తలను కూడా తీసుకోలేదు. కొందరు మాస్క్‌లను ధరించినా.. దాన్ని గడ్డం కిందికి చేర్చి..ఎదుటివారితో మాట్లాడుటం కనిపించింది.

Post Top Ad