పచ్చని పండుగ కొనసాగుతున్న హరితహారం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 28, 2020

పచ్చని పండుగ కొనసాగుతున్న హరితహారం

ఆరో విడుత హరితహా రం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నది. మూడో రోజైన శనివారం అన్ని జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటుతున్నా రు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటుతూ ప్రజల్లో స్ఫూర్తినింపుతున్నా రు. శనివారం మెదక్‌ జిల్లా శివ్వంపేట మండ లం గోమారంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, నిర్మల్‌లో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరితహారాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
అటవీ విస్తీర్ణం పెంపొందించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో  ప్రజలు  భాగస్వాములు కావాలని మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఉప్పల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ రూపొందించిన హరితహరం రథాన్ని శనివారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి ప్రారంభించారు.