హైకోర్టు సీరియస్ ఆదేశాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

హైకోర్టు సీరియస్ ఆదేశాలు

వలస కార్మికుల తరలింపు, వారికి కల్పించే వసతుల విషయంలో  తెలంగాణ హైకోర్టు  ప్రభుత్వానికి మరోసారి సీరియస్ సూచనలు చేసింది. స్వస్థలాలకు వెళ్లే వసల కార్మికులు రైళ్లు లేదా బస్సులు ఎక్కేవరకు వారికి భోజనం, ఉండేందుకు తగిన వసతి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఇటుక బట్టీల కార్మికులు ఇంకా వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించాలని కొద్ది రోజుల క్రితం హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలు కాగా.. మంగళవారం అది విచారణకు వచ్చింది. ఈ క్రమంలో ధర్మాసనం ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
కార్మిక శాఖ ఉప కమిషనర్లు రాష్ట్రంలోని ఇటుక బట్టీలు సందర్శించి వలస కూలీలను గుర్తించాలని హైకోర్టు సూచన చేసింది. స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలను షెల్టర్‌ జోన్లకు తరలించాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. సౌత్ సెంట్రల్ రైల్వేను సమన్వయం చేసుకొని వారి సహకారంతో వలస కార్మికులను సొంత ప్రదేశాలకు పంపే అంశాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవద్దని, దీన్ని సీరియస్‌గా పరిగణించాలని పేర్కొంది.