వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.....

శుభ తెలంగాణ న్యూస్ (12జూన్20) వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా మారిందని, కొరోన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా కళ్యాణలక్ష్మి ఆగదు అని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అన్నారు. మోమిన్ పేట్ మండల పరిషత్‌ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెండ్లికాని ఆడపిల్లలను ఆదుకోవాలనే ఉద్ధేశ్యంతో కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116 అందజేస్తున్నారన్నారు అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్దిదారులకు రూ. 18 లక్షల, 02 వేల, 088 రూపాయలు లబ్ది చేకూరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ZP వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, మోమిన్ పేట్ మండల పరిషత్ అద్యక్షురాలు శ్రీమతి వసంత వెంకట్ గారు, Pacs చెర్మెన్ అంజిరెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, TRS పార్టీ మండల అధ్యక్షులు నరసింహా రెడ్డి గారు, వైస్ ఎంపీపీ గారు, MPDO గారు, MRO గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.