హైదరాబాద్ మేయర్‌కు కరోనా పరీక్షలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 08, 2020

హైదరాబాద్ మేయర్‌కు కరోనా పరీక్షలు..

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు నెగటివ్‌గా తేలింది. ఇటీవల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆయన టీ తాగారు. అయితే అదే హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ముందు జాగ్రత్తగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్‌లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం(జూన్ 1) మనోజ్ అనే ఓ యువ జర్నలిస్ట్ కూడా కరోనాతో మృతి చెందడంతో ఆందోళన మరింత పెరిగింది. మాదన్న పేటకు చెందిన మనోజ్‌ పలు టీవీ ఛానళ్లలో క్రైమ్‌ రిపోర్టుగా పనిచేశారు. కాగా, ఇప్పటివరకూ తెలంగాణలో 3496 కరోనా కేసులు నమోదవగా.. ఒక్క హైదరాబా‌ద్‌లోనే అత్యధికంగా 2096 కేసులు నమోదయ్యాయి.
మొత్తంగా ఇప్పటివరకూ 1710 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. 1663 యాక్టివ్ కేసులు మాత్రమే కొనసాగుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 123కి చేరుకుంది. కొద్దిరోజులుగా వరుసగా 100కి పైనే కేసులు నమోదవుతుంటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో 148 కేసులు నమోదవగా.. ఇందులో 116 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. శనివారం నమోదైన 206 కేసుల్లో 152 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.

Post Top Ad