సైబరాబాద్ లో పోలీస్ సబ్సిడీ క్యాంటీన్ ప్రారంభించిన శ్రీ వీసీ సజ్జనార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

సైబరాబాద్ లో పోలీస్ సబ్సిడీ క్యాంటీన్ ప్రారంభించిన శ్రీ వీసీ సజ్జనార్


సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు పోలీస్ సబ్సిడీ క్యాంటీన్ ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ ఈ క్యాంటిన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ కరోనా నేపథ్యంలో పోలీసుల సౌకర్యార్థం ఈ సబ్సిడీ క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ‘పోలీసు సిబ్బంది కుటుంబ అవసరాల నిమిత్తం నిత్యావసరాలు సరుకులు అతి తక్కువ ధరకు, చౌకగా లభిస్తాయన్నారు. ఈ సౌకర్యాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, సైబరాబాద్ జాయింట్ సీపీ వేంకటేశ్వర రావు, ఐపీఎస్, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్, ఐపీఎస్, డి‌సి‌పి క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, ఐపీఎస్, డి‌సి‌పి బాలానగర్ పద్మజా, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డి‌సి‌పి అనసూయ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ (సీఎస్డబ్ల్యూ)ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు ఏడీసీపీ క్రైమ్స్ కవిత, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐ లు తదితరులు పాల్గొన్నారు.

More Photos:





Post Top Ad