సైబరాబాద్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

సైబరాబాద్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


శుభ తెలంగాణ న్యూస్ :(02/05/2020) సైబరాబాద్ తెలంగాణ  రాష్ట్ర  6వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సైబరాబాద్ పోలీస్  కమిషనరేట్ కార్యాలయంలో సామాజిక దూరం పాటిస్తూ అడిషనల్ డీసీపీ అడ్మిన్ లావణ్య ఎన్ జెపి జాతీయ  జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా సిబ్బందికి  రాష్ట్ర  అవతరణ  దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అమరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు.తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్దిలో మనవంతు పాత్ర ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృషి, క్రమశిక్షణతో మన భావితరాలకు మార్గానిర్దేశకత్వం చేసిన వారమావుతామన్నారు.పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలంగాణ పోలీసులకు మంచి పేరు తీసుకురావాలన్నారు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక, పేద తేడా లేకుండా పోలీస్ సేవలు అందించాలన్నారు.పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడటం లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో వీర జవాన్లు.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు మరియు ఇతర సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు.తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరొందిందన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడం జరిగిందన్నారు.కరోనా వ్యాధి నివారణ గురించి అధికారులు సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తప్పకుండా శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు వేసుకోవాలని బయట తిరిగే సమయంలో భౌతిక దూరం పాటించాలన్నారు.విధులు నిర్వహించడం ఎంత ముఖ్యమో, కరోనా వ్యాధి బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడీసీపీ (ఎస్బీ) గౌస్ మొహియుద్దీన్, ఏడీసీపీ క్రైమ్స్ II ఇందిరా, అడిషనల్ ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య ఎన్ జె పి, సిఎఓ (అడ్మిన్) మహమూదా బేగం సిఎఓ (అకౌంట్స్) చంద్రకళ, సీసీఅర్బీ ఏసీపీ రవిచంద్ర, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, సెక్షన్ల సుపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్, ఐటీ, ఏఆర్ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.