ప్రముఖ యాంకర్ ఉదయభాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆమె నేడు నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల పార్కు నందు మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... నెల రోజులు భోజనం లేకుండా ఉండగలం. వారం రోజులు నీరు లేకుండా ఉండగలం. కానీ గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేమన్నారు. కావునా తమ వంతు కర్తవ్యంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాల్సిందిగా పేర్కొన్నారు. ప్రకృతికి కోసం వస్తే ఏమవుతుందో మనందరం కళ్లారా చూస్తున్నాము. ముందు తరలా వారికి మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా ప్రకృతినే ప్రేమించే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించడం గొప్ప విషయమని కొనియాడారు. తనకు కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టమన్న ఉదయభాను తన ఇద్దరు కూతుళ్లకు భూమి, ఆరాధ్య అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే మనం తాగే నీటిని కొనుకుంటున్నాం. కొంత కాలం తర్వాత ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. అందుకే అందరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఉదయభాను మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. హీరోయిన్ రేణుదేశాయ్, డైరెక్టర్ సంపత్ నంది, ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ను గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా ఆమె కోరారు. మూడు మొక్కలు నాటి వాటి సంరక్షించాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
Post Top Ad
Sunday, June 21, 2020
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఉదయభాను
Admin Details
Subha Telangana News