యోగా గురువుకు లిఖితపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వివేకానంద్ ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 22, 2020

యోగా గురువుకు లిఖితపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వివేకానంద్ .....

శుభ తెలంగాణ న్యూస్ (22జూన్20)మేడ్చల్ జిల్లా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన యోగా గురువు కౌడ మల్లేష్ ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్  తన నివాసం వద్ద తన అధికారిక పత్రం (లెటర్ హెడ్) పై లిఖితపూర్వకంగా ప్రశంసిస్తూ  లేఖను అందించారు. ఈ సందర్భంగా యోగా గురువుగా గత పదేళ్లుగా సేవలందిస్తూ.. యోగా విశిష్టతను తెలియజేస్తూ.. ఎందరికో శిక్షణనిస్తూ శారీరక, బౌద్ధిక కోణాలను సమగ్రంగా సంయోగపరచి స్థిరమైన, సంతృప్తికరమైన, ఉత్పాదక జీవితాన్ని మెరుగుపర్చుకోవడంలో ఎంతో కృషి చేస్తున్న యోగా గురువుకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలో ప్రస్తావించారు.