జలదీక్ష పేరుతో ప్రాజక్టుల సందర్శన.. కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 04, 2020

జలదీక్ష పేరుతో ప్రాజక్టుల సందర్శన.. కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు..

ప్రాజెక్టుల పరిశీలన పేరుతో జలదీక్షలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలంగాణ ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై నిరసన కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కృష్ణా పరవాహక ప్రాంత ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసారు. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.
ఆ సంఘటన జరిగి 24గంటలు గడవక ముందే గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ పరిశీలనకు వెళ్లనున్న పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లోని పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం నుండి బయలు దేరిన పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేసేందుకు సిద్దమయ్యారు తెలంగాణ పోలీసులు. పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో మంజీరా డ్యాం పరిశీలనకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకుల బృందానికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

Post Top Ad