తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 27, 2020

తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శుక్రవారం కొత్తగా 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,349కి చేరింది. కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 237కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
శుక్రవారం 78 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4766కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 7436 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 4374 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 75,308 మందిని పరీక్షించారు.
తాజాగా నమోదైన 985 కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 774 ఉన్నాయి. రంగారెడ్డిలో 86, మేడ్చల్ 53, వరంగల్ అర్బన్ 29, మెదక్ 9, ఆదిలాబాద్ 7, నాగర్ కర్నూల్ 6, నిజామాబాద్‌లో 6, రాజన్న సిరిసిల్లలో 6, సిద్దిపేటలో 3, ములుగులో 2, వికారాబాద్‌లో 1, మహబూబ్ నగర్‌లో 1, జగిత్యాలలో 2, జయశంకర్ భూపాలపల్లిలో 3, ఖమ్మంలో 3, యాదాద్రి భువనగిరిలో 2, మిర్యాలగూడలో 1 కేసులు నమోదయ్యాయి.