మేడ్చల్ జిల్లా కాప్రా గాంధీనగర్ లో డా.బి.ఆర్ అంబెడ్కర్ భవన్ స్థలం లో తెలంగాణ రాష్ట్ర" అవతరణ దినోత్సవ సంబరాలు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

మేడ్చల్ జిల్లా కాప్రా గాంధీనగర్ లో డా.బి.ఆర్ అంబెడ్కర్ భవన్ స్థలం లో తెలంగాణ రాష్ట్ర" అవతరణ దినోత్సవ సంబరాలు....

శుభ తెలంగాణ న్యూస్:మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా గాంధీనగర్ లోని డా బి ఆర్ అంబెడ్కర్ భవన్ స్థలం ప్రాంగణం లో గాంధీనగర్ వెల్ఫేర్ & యూత్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వెల్ఫేర్ అధ్యక్షులు శ్రీ ఎన్ మహేష్ "జాతీయ జండా " ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు, డా.బి.ఆర్ అంబెడ్కర్ గారు రాజ్యాంగం లో పొందుపర్చిన ఆర్టికల్ 3 ఆధారంగానే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైనదని, రాష్ట్ర సాధనలో అమరులను తలుచుకొని నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమం లో  గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్  ఉపాధ్యక్షులు యం భిక్షపతి,సభ్యులు జి. నర్సింహా, ఎన్ కుమార్, కృష్ణ గార్లు మరియు యూత్ అసోసియేషన్ అధ్యక్షులు  జి సత్యనారాయణ, సభ్యులు బి శివరామ కృష్ణ, రాకేష్, సుధాకర్,సురేష్, మణికంఠ, శ్రీను  తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad