లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై జీవో - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 05, 2020

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై జీవో

రాష్ట్రంలో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై జీవోనంబర్‌ 75ను  విడుదలచేశారు. లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చారు. కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం జూన్‌ 30 వరకు పొడిగించారు. మిగతా ప్రాంతాల్లో దశలవారీగా నిషేధాన్ని ఎత్తివేయనున్నారు. స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలతోపాటు శిక్షణా సంస్థలు, కోచింగ్‌ ఇన్‌స్టిట్యూషన్లపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. మెట్రో రైళ్లపైనా నిషేధం ఉన్నది. సినిమాహాళ్లు, జిమ్నాసియమ్స్‌, స్విమ్మింగ్‌ పూళ్లు, ఎంటర్‌టైన్మెంట్‌ పార్కులు, స్పోర్ట్స్‌ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లు వంటివి నిషేధించారు. సోషల్‌, పొలిటికల్‌, స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌, అకడమిక్‌, సంప్రదాయక, మతపరమైన ఫంక్షన్లను, పెద్దసంఖ్యలో నిర్వహించే ఇతర ఫంక్షన్లపై నిషేధం కొనసాగుతున్నది. జూన్‌ ఎనిమిది నుంచి అన్ని రకాల మతపర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు.. హోటళ్లు, రెస్టారెంట్లు, హస్పిటాలిటీ సర్వీసులు కూడా నడుస్తాయి. సినిమాహాళ్లు, ఆట స్థలాలు మినహాయించి ఇతర షాపింగ్‌ మాళ్లకు అనుమతించారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రజలు రోడ్లపైనా తిరుగడాన్ని నిషేధించారు.

Post Top Ad