స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 09, 2020

స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి

లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో.. వాహనదారులు ప్రభుత్వ నియమాలను పాటిస్తున్నారా లేదా అని మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తా వద్ద మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో, కార్లు, బస్సులలో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడారు. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని మంత్రి సూచించారు. మాస్క్ లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ లకు సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ఆయన సూచించారు.