ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా పాజిటివ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 25, 2020

ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా పాజిటివ్

కొద్ది రోజుల క్రితం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సిబ్బందిలో మరింత మందికి కరోనా సోకినట్లు తేలింది. రాజాసింగ్ డ్రైవర్లు, గన్‌మెన్లకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని అధికారులు గురువారం గుర్తించారు. సిబ్బందిలో ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు గన్‌మెన్లకు కరోనా సోకింది. అంతేకాక, మరో ఐదుగురు సిబ్బందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. తన సిబ్బందిలో కరోనా సోకడంతో ఎమ్మెల్యే ఇటీవల రోగనిరోధక శక్తి పెంచుకొనేందుకు కసరత్తులు ప్రారంభించారు. రోగ నిరోధక శక్తి పెంపొందించుకొనేందుకు తాను జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం ఓ వీడియో విడుదల చేశారు.ఇప్పటికే తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. జనగామ శాసస సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్‌ గుప్తాకు కూడా కరోనా సంక్రమించింది. ప్రస్తుతం వీరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.