భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 22, 2020

భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింత తీవ్రంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 730 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులు కాగా, ఇతర జిల్లాల్లో 71 కేసులు నమోదయ్యాయి.
తాజాగా 730 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7802కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 210 మంది మరణించారు. 3731 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3861 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం 3297 మంది నమూనాలు పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 57,054 నమూనాలను పరీక్షించగా.. 49,252 నెగిటివ్ వచ్చాయని వెల్లడించింది.
ఇక జిల్లాలవారీగా కేసులను గమనించినట్లయితే.. జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులు, జనగామలో 34, రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 9, అసిఫాబాద్‌లో 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణ్ పేట్, మెదక్, నల్గొండల్లో ఒక్కో కేసు నమోదైంది. వికారాబాద్ 2, వరంగల్ జిల్లాలో 6, యాదాద్రిలో 1క కేసు నమోదైంది.
ఇక దేశ వ్యాప్తంగా 4,26,473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,75,748 యాక్టివ్ కేసులున్నాయి. 2,36,979 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారినపడి 13,695 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్రంలో 3870 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,32,075కు చేరింది. ఢిల్లీలో తాజాగా 3000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 59,746కు చేరింది. తమిళనాడులో ఆదివారం 2532 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 59,377కు చేరింది.