పీవీ సంస్కరణలే దేశాన్ని కాపాడాయి.. మాజీ ప్రధానికి కేసీఆర్, జగన్ నివాళి.. హెచ్‌సీయూకు పీవీ పేరు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 28, 2020

పీవీ సంస్కరణలే దేశాన్ని కాపాడాయి.. మాజీ ప్రధానికి కేసీఆర్, జగన్ నివాళి.. హెచ్‌సీయూకు పీవీ పేరు..

''ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం అధకారంలో ఉండింది.. ఉన్న బంగారం నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితి. తనకు మాత్రమే సాధ్యమైన దేశాన్ని కాపాడి, ఆర్థిక రంగంలో మరింత ముందుకు నడిపించిన ధీరుడాయన..'' అంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కీర్తించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాభివృద్ధి కోసం పీవీ అందించిన సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా ఇద్దరు సీఎంలు నివాళులు అర్పించారు.
శతజయంతి సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దేశమంతా స్మరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో పీవీ సేవలను యాదిచేసుకున్నారు. పీవీ తెలంగాణకు చెందినవారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆదివారం జరిగిన ముఖ్య వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
‘‘పీవీ తెలంగాణకు ఠీవి. ఆయనది 360 డిగ్రీల అసాధారణ వ్యక్తిత్వం. ఆయన జీవితమంతా సంస్కరణతోనే సాగింది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా.. ఏ హోదాలో పనిచేసినా ఆ పదవికే గౌరవం తీసుకొచ్చారు. రాజకీయాలకు సంబంధంలేని మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని, గొప్ప సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించారు. విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చడమేకాదు, దేశంలో గురుకుల పాఠశాలన్ని ప్రారంభించింది కూడా పీవీనే. స్వతహాగా 1200 ఎకరాల భూస్వామిఅయినా, తనవకు కేవలం 150 ఎకరాలు ఉంచుకొని మిగతాది ప్రజలకు ఉపయోగించిన ఉదారవాది పీవీ'' అని కేసీఆర్ గుర్తుచేశారు.