రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే ఆ పార్టీ నాశనం.. టీఆర్ఎస్ నేతలు ఫైర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, June 07, 2020

రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే ఆ పార్టీ నాశనం.. టీఆర్ఎస్ నేతలు ఫైర్

హైదరాబాద్ శివారు జన్వాడలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫాంహౌస్ నిర్మించారంటూ రేవంత్ రెడ్డి పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఎన్జీటీని ఆశ్రయించగా.. శుక్రవారం గ్రీన్ కోర్టు మంత్రి కేటీఆర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు ఈ వ్యవహారంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సంచలనాల కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కర్నె ప్రభాకర్‌, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad