ఆన్‌లైన్‌ విద్యలో యోగా :ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 22, 2020

ఆన్‌లైన్‌ విద్యలో యోగా :ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన

ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న విద్యాసంస్థ లు .. యోగాను కూడా చేర్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం ఆరో అంతర్జాతీయ యోగా దినోత్స వం సందర్భంగా ఢిల్లీలో స్పిక్‌ మెకే సంస్థ నిర్వహించిన ‘డిజిటల్‌ యోగా అండ్‌ మెడిటేషన్‌ శిబిరం’లో తన నివాసం నుంచి ఆన్‌లైన్‌లో ఆయన పాల్గొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ సిమ్లాలో యోగాసనాలు వేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన యోగా డేలో జగద్గురు శంకరాచార్యులు, హంపి విరుపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామీజీ పాల్గొన్నారు. హై దరాబాద్‌లోని నివాసంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి యోగా చేశారు. 

యోగాతో ఆనందమయ జీవితం: మాజీ ఎంపీ కవిత 

యోగాతో ఆయుష్షు పెరుగడంతోపాటు మన జీవనం ఆనందమయం అవుతుందని మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. ‘యోగాను నమ్మండి. ముఖ్యంగా ప్రాణాయామం నాకు వ్యక్తిగతంగా ఎంతో ఉపయోగపడింది’ అని ట్వీట్‌ చేశారు. ‘యోగా ప్రతిఒక్కరి జీవితంలో భాగమవ్వాలని, ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగస్వామి కావాలి’ అని మంత్రి హరీశ్‌రావు  ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు: వినోద్‌కుమార్‌

ప్రతిరోజు యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ చెప్పారు. బంజారాహిల్స్‌లోని నివాసంలో పెద్దకుమారుడు డాక్టర్‌ ప్రతీక్‌తో కలిసి యోగాసనాలు వేశారు. మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ తన నివాసంలో యోగాసనాలు వేశారు. సీఐఐ ఆధ్వర్యంలో జూమ్‌యాప్‌ ద్వారా యోగా డేలో మంత్రితోపాటు 1000 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డేలో జైళ్లశాఖ ఐజీ సైదయ్య ఆసనాలు వేశారు.