(శుభతెలంగాణ)కుత్బుల్లాపూర్(16జూన్20)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పేట్ బషీరాబాద్ కోల్ నాలా సమస్యపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో జెడ్సి మమత వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోల్ కాలువా పనుల్లో భాగంగా పూడిక తీత, వెడల్పు పనులను అధికారులు ఎమ్మెల్యే కి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోల్ కాలువ జటిలమైన సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేయాలని, నాలా నిర్మాణ పనుల్లో స్థలాలు కోల్పోయే వారిని గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Post Top Ad
Tuesday, June 16, 2020
కోల్ నాలా సమస్యపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే......
Tags
# తెలంగాణ

About Subha Telangana
తెలంగాణ
Tags
తెలంగాణ
Admin Details
Subha Telangana News