- మంత్రి కేటీఆర్‌ను ‘డైనమిక్ పర్సన్' అంటూ పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంబోధించారు. హైదరాబాద్, విజయవాడ మధ్య హైస్పీడ్ రైల్వేలైన్ కోసం కృషిచేస్తే మంత్రి కేటీఆర్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారి స్తే.. రెండు తెలుగు రాష్ర్టాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజనల్ కేం ద్రంగా ప్రకటించి, నూతన కార్యాలయం ప్రారంభించినందుకు ఆయన ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేటీఆర్ తన ప్రసంగంలో ఉత్తమ్ విజ్ఞప్తులపై స్పందిస్తూ.. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఐదేండ్లు పూర్తిచేసుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఈ సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Post Top Ad
Tuesday, June 30, 2020
మంత్రి కేటీఆర్‌ను ‘డైనమిక్ పర్సన్' అంటూ పీసీసీ చీఫ్
Admin Details
Subha Telangana News