వచ్చే నెల నుంచి స్కూల్స్ ఓపెన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

వచ్చే నెల నుంచి స్కూల్స్ ఓపెన్

తెలంగాణలో త్వరలోనే పాఠశాలలు తెరుచుకునేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జులై 1 నుంచి ఉన్నత పాఠశాలలను, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణ విద్యాశాఖ 2020-21 విద్యా సంవత్సరానికి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఒక తరగతి గదిలో 15 మంది విద్యార్థులకు మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల గ్రౌండ్, తరగతి గదుల్లో కూడా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
అంతేగాక, మాస్కులు, శానిటైజర్స్ వాడకాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకే పరిమితం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది.
కాగా, విద్యాశాఖ మార్గదర్శకాల నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో షిఫ్టుల పద్ధతిలో క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలుస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో ఆదివారం, సోమవారం సెలవు ఉంటుంది.
రెండో శనివారం మాత్రం సెలవు ఉండదు. ప్రైమరీ సెక్షన్ సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. 8 నుంచి 10వ తరగతి వరకు ప్రతీరోజూ క్లాసులు ఉంటాయి. అయితే, స్కూళ్లలో ఎలాంటి ఆటలకు ప్రస్తుతం అనుమతి లేదు.