ఊపిరి పీల్చుకున్న వరంగల్ వైద్యులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 04, 2020

ఊపిరి పీల్చుకున్న వరంగల్ వైద్యులు

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఆపదలో ఆదుకొని జీవం పోసే వైద్యులను సైతం ఇది కలవర పెడుతున్నది. నిన్న హైదరాబాద్ నిమ్స్, ఉస్నానియా దవాఖానల్లో పని చేస్తున్నపీజీ వైద్యులకు కరోనా సోకిన విషయం తెల్సిందే. వారికి చికిత్స అందిస్తూ హోం క్వారంటైన్ లో ఉంచారు. 
కాగా, ఇప్పుడు వరంగల్ ఎంజీఎంలో పని చేస్తున్న పీజీ  వైద్యుల్లో ఆందోళన నెలకొంది. వీరి భయానికి కారణం ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వ్యక్తికి 16 మంది పీజీ వైద్యులు చికిత్స అందించడమే. అయితే తమకు కొవిడ్ టెస్టులు చేయాలని, వైరస్ సోకే అవకాశం ఉంటుందని వీళ్లు పట్టుబట్టారు. దీంతో నిన్న వారి రక్త నమూనాలు తీసుకొని పరీక్షించారు. ఈ రిపోర్ట్ లో నెగటివ్ రావటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.