హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 16, 2020

హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్...

హైదరాబాద్‌ కోఠిలోని గోకుల్ చాట్ యజమాని విజయ్ వైరాగ్యి(70)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు గోకుల్ చాట్ షాపును సీజ్ చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా అక్కడ పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారెంటైన్‌కి తరలించారు.యజమానికి కరోనా సోకిన నేపథ్యంలో.. గత 3 రోజులుగా షాపుకు వచ్చి స్నాక్స్ తిన్నవారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
గోకుల్ చాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. పక్క షాపుల యజమానుల్లోనూ ఆందోళన మొదలైంది. సాధారణ రోజుల్లో గోకుల్ చాట్ ఎంత రద్దీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మార్చి 25న లాక్ డౌన్ తర్వాత మూడతపడ్డ ఈ షాపు.. ఇటీవలి సడలింపుల తర్వాత తిరిగి తెరుచుకుంది. తాజాగా ఆ యజమానికి పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో మరోసారి మూతపడింది.ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5193గా ఉంది. సోమవారం (జూన్ 15) ఒక్కరోజే 219 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 189 కేసులు ఉన్నాయి. ఇందులో 449 మంది వలస కార్మికులు,విదేశీయులు ఉన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 2766 మంది డిశ్చార్జి అయ్యారు.