నేడు ఆక్సిజన్‌ పార్కును సందర్శించనున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 13, 2020

నేడు ఆక్సిజన్‌ పార్కును సందర్శించనున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఉదయం 9 గంటలకు కండ్లకోయ రిజర్వు ఫారెస్ట్‌ను సందర్శించనున్నారు. హైదరాబాద్‌ మహానగర ప్రజలకు ఆకుపచ్చని అందాలతో కొత్త ఊపిరిని ఊదాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం సుమారు 28 రిజర్వు ఫారెస్ట్‌ బ్లాక్‌లను అర్బన్‌ లంగ్స్‌ పార్కులుగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశీ పక్షులతో కూడిన ఏవియరీ, బటర్‌ఫ్లై పార్కు, మెడిసినల్‌ గార్డెన్‌, ట్రీ హౌస్‌, ఓపెన్‌ క్లాస్‌రూంలు, యోగా షెడ్‌, వాకింగ్‌ ట్రాక్‌, సైకిల్‌ ట్రాక్‌, థీమ్‌ పార్కులతో ది బెస్ట్‌ అర్బన్‌ లంగ్స్‌ పార్కుగా కీర్తి గడిస్తున్న కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కును సీఎస్‌ స్వయంగా సందర్శించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అర్బన్‌ లంగ్స్‌ పార్కులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా సీఎస్‌ ఆక్సిజన్‌ పార్కుకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌, పీసీసీఎఫ్‌ శోభ, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు, ఇతర అటవీ శాఖ అధికారులు సందర్శించనున్నారు.