కేటీఆర్.. ఒంటి గంటకు ముసళ్ల పండగ.. రేవంత్ షాకింగ్ ట్వీట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 08, 2020

కేటీఆర్.. ఒంటి గంటకు ముసళ్ల పండగ.. రేవంత్ షాకింగ్ ట్వీట్

మంత్రి కేటీఆర్‌ ఫాంహౌజ్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పోరాటం చేస్తు్న్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పోరాటాన్ని ఆయన మరో స్థాయికి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఆయన చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. కేటీఆర్, తెలంగాణ సీఎంఓను ఆ ట్వీట్‌లో ట్యాగ్ చేసి.. ‘‘ముందుంది ముసళ్ల పండుగ. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు..’’ అంటూ తీవ్రమైన ఉత్కంఠ రేపారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కేటీఆర్‌కు సంబంధించిన ఏవో రహస్యాలు చెప్పనున్నారనే క్లూ ఇచ్చినట్లయింది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్వాడలో ఫాంహౌస్ అక్రమంగా నిర్మించారని, పర్యావరణానికి హాని కలిగించేలా జీవో 111 జీవోను అతిక్రమించి మూడంతస్తుల భవనం, చుట్టూ ఉద్యానవనం నిర్మించుకున్నారంటూ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్జీటీ ఆ ఫాంహౌస్‌ నిర్మాణంపై విచారణకు కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ విచారణ జరిపి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అయితే, దీనిపై స్పందించిన కేటీఆర్ తనపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ర్పచారాలు చేస్తున్నారని, ఆ ఫాంహౌస్ తనది కాదనే విషయం తాను గతంలోనే చెప్పానని ట్వీట్ చేశారు. కేటీఆర్ ఈ ట్వీట్ చేసిన వెంటనే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆయనకు మద్దతు పలికారు. అంతేకాక, ఆదివారం టీఆర్ఎస్ నేతలు కొంత మంది ప్రెస్ మీట్‌పై రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినీ నటుడు పోసాని కూడా కేటీఆర్‌ విషయంలో స్పందించారు. కేటీఆర్ నిజాయతీ పరుడని అన్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి దుష్ర్పచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా చేసిన ఉత్కంఠ రేపే ట్వీట్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

Post Top Ad