యువకుడి ప్రాణాలు నిలబెట్టిన ఎస్సై - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 19, 2020

యువకుడి ప్రాణాలు నిలబెట్టిన ఎస్సై

ప్రాణాపాయంలో ఉన్న యువకుడిని కాపాడి మానవత్వం చాటుకున్నారో ఎస్సై. కరీంనగర్‌లో ఓ యువకుడు ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. యువకుడు ట్రాక్టర్ కింద పడిపోయాడు.. ఇంతలో ఎస్సై ప్రశాంత్ పెట్రోలింగ్‌లో భాగంగా అటువైపు వచ్చారు. యువకుడ్ని బయటకు తీసి.. ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఎస్సై ప్రశాంత్ తన పోలీస్ పెట్రోల్ వాహనంలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
వాహనంలోకి ఎక్కించిన తర్వాత యువకుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. వెంటనే ఎస్సై ప్రశాంత్ గుండెకు పంపింగ్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. యువకుడు కాస్త తేరుకోవడంతో వెంటనే అక్కడి నుంచి హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువకుడిని కరీంనగర్ ఎస్ఐ ప్రశాంత్ కాపాడారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. సరైన సమయానికి యువకుడ్ని తరలించి ఎస్సై అతడి ప్రాణాలు నిలబెట్టారు.