కార్పొరేట్ హంగులతో గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2020

కార్పొరేట్ హంగులతో గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్

అత్యాధునిక సౌకర్యాలతో యుద్ధ ప్రాతిపాదికన గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖానను ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టిమ్స్ దవాఖానను మంత్రి సందర్శించి మాట్లాడారు. టిమ్స్ లో వెయ్యి బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, మరో మూడు, నాలుగు రోజుల్లో టిమ్స్ దవాఖాన ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటికే అక్కడ ఓపీ విభాగం నడుస్తున్నదని తెలిపారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినం. ఆరోగ్య రంగంలో కేరళ, తమిళనాడుతో పోటీ పడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. 
ఇంత చేస్తున్నా కొందరు  ప్రభుత్వంపై కుట్ర పూరితంగా బురదచల్లే ప్రయత్నం  చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణాలు పణంగా పెట్టి డాక్టర్లు వైద్యం చేస్తుంటే గాంధీ దవాఖాన వైద్యులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనాకు వెరవకుండా ప్రభుత్వ వైద్యులు సేవలందిస్తున్నారని కొనియాడారు. జిల్లా స్థాయిలోనూ ఐసీయూలు, వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గాంధీ దవాఖాన పూర్తిగా కొవిడ్ హాస్పిటల్ గా మారిందన్నారు.
అలాగే కరోనా లక్షణాలు ఉన్నవారే హాస్పిటల్ కు రావాలని ఐసీఎంఆర్ చెప్పిందని, డబ్బులు ఉన్నాయని చాటుమాటుగా పరీక్షలు చేసుకోవద్దని సూచించారు. కరోనా కేవలం టెస్టులతోనే సరిపోదు ప్రైమరీ కాంటాక్ట్స్, ట్రేసింగ్ తదితర అశాలు ఉంటాయన్నారు. 
పీపీఈ కిట్లు వేసుకొని రెండు గంటలు పని చేయలేని పరిస్థితి  ఉందన్నారు. చెమట దారళంగా కారిపోతున్నదని, బాధ్యత లేనివారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం రూపాయి ఖర్చులేకుండా ఐసోలేషన్ సౌకర్యం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ వైద్యంపై భరోసాతో ఉండాలని మంత్రి సూచించారు. టెస్టుల పక్రయ నిరంతరం కొనసాగుతుందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.