కొరోనా వైరస్‌, సీజనల్‌ వ్యాధుల నివారణకై ఇంటెన్సివ్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ - MLA డాక్టర్ మెతుకు ఆనంద్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 06, 2020

కొరోనా వైరస్‌, సీజనల్‌ వ్యాధుల నివారణకై ఇంటెన్సివ్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ - MLA డాక్టర్ మెతుకు ఆనంద్....

శుభ తెలంగాణ న్యూస్ (06జూన్వి20)వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఈ రోజు ఉదయం వికారాబాద్ మునిసిపల్ లోని 28 వ వార్డులో *ఇంటెన్సివ్‌ శానిటేషన్‌ డ్రైవ్‌* కార్యక్రమంలో పాల్గొన్నారు.28 వ వార్డు లోని అన్ని వీధులలో తిరిగి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. రాబోయే వర్షాకాలంలో మలేరియా, విరేచనాలు, గ్యాస్ట్రోఎంటెరిటిస్‌, ‌డెంగ్యూ, టైఫాయిడ్‌, ‌చికున్‌ ‌గున్యా వైరల్‌ ‌జ్వరం వంటి కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్యాన్ని కాపాడ టానికి ఇంటెన్సివ్‌ ‌శానిటేషన్‌ ‌డ్రైవ్‌ ‌ద్వారా పూర్తి పారిశుధ్య కార్యకలాపాలు నిర్వహించి వ్యాధుల నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అని, కొవిడ్‌ దృష్ట్యా మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త, ఖాళీస్థలాల్లో పిచ్చి మొక్కలను తొలిగించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్ గారు, స్థానిక కౌన్సిలర్ స్వాతి గారు, మోముల రాజు గారు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Post Top Ad