ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో MLA డాక్టర్ మెతుకు ఆనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 15, 2020

ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో MLA డాక్టర్ మెతుకు ఆనంద్

శుభ తెలంగాణ న్యూస్ (15జూన్20)వికారాబాద్ జిల్లా
సిజనల్ వ్యాధుల ను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమములో  6వ ఆదివారం వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్  వారి సతీమణి Dr. సబితా ఆనంద్ తో కలిసి తన ఇంటిలో భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా ఇంటి పరిసరాల్లో  దోమలు రాకుండా ఉండేందుకు గాను బంతి, కృష్ణతులసి, నిమ్మగడ్డి మొక్కలను  నాటారు.  ఈ కార్యక్రమం నిరంతరం  పది వారాల పాటు కొనసాగించాలని (ఇంకో 4 వారాలు) MLA డాక్టర్ మెతుకు ఆనంద్  ప్రజలను కోరారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధుల ను అరికట్టడానికి వీలవుతుందని MLA డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సీజనల్ వ్యాధుల ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని ఈ సందర్భంగా MLA కోరారు.