ఇంటింటికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ లో వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, June 18, 2020

ఇంటింటికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ లో వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్.....

శుభ తెలంగాణ న్యూస్ (18జూన్20) తెలంగాణ  ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా మారిందని, కొరోన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా కళ్యాణలక్ష్మి ఆగదు అని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అన్నారు. వికారాబాద్ మునిసిపల్ లోని పలు వార్డులలో కళ్యాణలక్ష్మి చెక్కులను MLA స్వయంగా ఇంటింటికి/వార్డులకు వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116 అందజేస్తున్నారన్నారు. మునిసిపల్ లోని వివిధ వార్డులకు చెందిన 62 మంది లబ్దిదారులకు రూ. 62 లక్షల, 07 వేల, 192 రూపాయలు లబ్ది చేకూరిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి గారు, శుభప్రద్ పటేల్ గారు, PACS  చైర్మన్ ముత్యంరెడ్డి గారు, MRO రవీందర్ గారు, డిప్యూటీ MRO విజేందర్ గారు, హఫీజ్ గారు, Ex మునిసిపల్ వైస్ చైర్మన్ చిగుల్లపల్లి రమేష్ గారు, పార్టీ ప్రెసిడెంట్లు ప్రభాకర్ రెడ్డి గారు, కమాల్ రెడ్డి గారు, Ex మార్కెట్ ఛైర్మెన్ రాంచెంద్రారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, రాంరెడ్డి గారు, షరీఫ్ గారు, సురేష్ గారు, అనంత్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, రాజమళ్లు గారు, కిరణ్ పటేల్ గారు, నవీన్ కుమార్ గారు, రమణ గారు, లక్ష్మణ్ గారు, కృష్ణ రెడ్డి గారు, బోండల సువర్ణ అశోక్ గారు, పావని చంద్రశేఖర్ రెడ్డి గారు, మోముల రాజ్ కుమార్ గారు, చెందర్ నాయక్ గారు, సురేష్ గౌడ్ గారు, దత్తు గారు, వేణుగోపాల్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, సుబాన్ రెడ్డి గారు, ఇతర కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.