ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, June 22, 2020

ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్...

శుభ తెలంగాణ న్యూస్ (22జూన్  సీసానాల్  వ్యాధుల ను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమములో ఆదివారం  (7వ ఆదివారం) వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్  వికారాబాద్ లోని జిల్లా గ్రంథాలయం ముందు ఉన్న స్వామి వివేకానంద పార్కులో  భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా పార్క్ పరిసరాల్లో ఉన్న నీటి తొట్టిలో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేశారు, పార్క్ పరిసరాలు శుభ్రంగా ఉండేలా మునిసిపల్ సిబ్బందితో పనులు చేయించారు.
ఈ కార్యక్రమం నిరంతరం  పది వారాల పాటు కొనసాగించాలని (ఇంకో 3 వారాలు) MLA డాక్టర్ మెతుకు ఆనంద్  ప్రజలను కోరారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధుల ను అరికట్టడానికి వీలవుతుందని MLA డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సీజనల్ వ్యాధుల ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని ఈ సందర్భంగా MLA కోరారు.ఈ కార్యక్రమంలో శుభప్రద్ పటేల్, PACS ఛైర్మెన్ ముత్యంరెడ్డి,  MPDO సత్తయ్య , శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి , సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, నందకుమార్, షరీఫ్, అనంత్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.