శుభ తెలంగాణ (24జూన్20) వికారాబాద్ జిల్లా మంగళవారం వికారాబాద్ మునిసిపల్ కార్యాలయంలో హరితహారం పై నిర్వహించిన సమీక్ష సమావేశం లో వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హరితహారం (Haritha Haram) పథకం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని (Tree Plantion) ప్రతిఏటా ఉద్యమంలా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు హరితహారాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఏటా కోట్లాది మొక్కలను సైతం నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 25నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభంకానుంది. కావున వికారాబాద్ మునిసిపల్ పరిధిలో విరివిగా మొక్కలు నాటాలి అని నాటిన అన్ని మొక్కలు సంరక్షించాలి అని MLA డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్ , వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం, మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Post Top Ad
Wednesday, June 24, 2020
ప్రతి మొక్క బ్రతకాలి - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్.......
Tags
# తెలంగాణ

About Subha Telangana
తెలంగాణ
Tags
తెలంగాణ
Admin Details
Subha Telangana News