శుభ తెలంగాణ న్యూస్ (22జూన్20) వికారాబాద్ జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితమే ఒక ఉద్యమం - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు పలువురు ప్రముఖులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా MLA డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ....ఆచార్య జయశంకర్ సార్కు యావత్ తెలంగాణ నివాళి అర్పిస్తోంది. 1957లో ఒక సామాన్య పాఠశాల ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టిన జయశంకర్ 2011 జూన్ 21న కన్నుమూసే సమయానికి కొద్దిమంది ఆత్మీయులను వందలమంది స్నేహితులను వేలమంది పరిచయస్థులను లక్షల మంది అభిమానులను సంపాదించుకుని నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గౌరవాన్ని, అభిమానాన్ని పొందారు. ఒక వ్యక్తి జీవితం సఫలమవడమంటే ఇదే..! మానవ సంబంధాలలో హుందాతనానికి, మనుషులతో సామాజిక బాధ్యతకు, ప్రతివారి ప్రగతి కోరుకునే అత్యున్నత వ్యక్తిత్వానికి డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ సాటిలేని ఉదాహరణ! జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణ ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ KCR సారధ్యంలో సాధ్యం అవుతుంది అని MLA అన్నారు.ఈ కార్యక్రమంలో శుభప్రద్ పటేల్ , PACS ఛైర్మెన్ ముత్యంరెడ్డి, MPDO సత్తయ్య, శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి , నందకుమార్, షరీఫ్, అనంత్ రెడ్డి , ఇతర నాయకులు పాల్గొన్నారు.
Post Top Ad
Monday, June 22, 2020
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితమే ఒక ఉద్యమం - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్.....
Tags
# తెలంగాణ

About Subha Telangana
తెలంగాణ
Tags
తెలంగాణ
Admin Details
Subha Telangana News