శుభ తెలంగాణ న్యూస్ (05జూన్20) వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఈ రోజు ధారూర్ మండలం లోని మున్నూరు సోమరం గ్రామంలో మిషన్ కాకతీయ ఫేస్ 3 లో భాగంగా కొత్త చెరువు పునరుద్ధరణ మరియు పూడికతీత పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.చెరువులో స్వయంగా JCB తో పూడిక తీసారు. చెరువు యొక్క కాలువలు పరిశీలించారు. మైనర్ ఇరిగేషన్కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టాలి. అందరి భాగస్వామ్యం వల్లే మిషన్ కాకతీయ ఫేజ్-1, ఫేస్-2, విజయవంతమైంది. మిషన్ కాకతీయ ఫేజ్ -1, ఫేస్-2, పనులు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో MPP విజయలక్ష్మి గారు, ZPTC సుజాత గారు, శివారెడ్డి పెట్ PACS చైర్మన్ ముత్యంరెడ్డి గారు, trs పార్టీ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు, రాంరెడ్డి గారు, రాములు గారు, సంతోష్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, AEE సుకుమార్ గారు, సుబాన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ గారు, స్థానిక ఉపసర్పంచ్ గారు, ఇతర నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Post Top Ad
Friday, June 05, 2020
ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టడమే మిషన్ కాకతీయ లక్ష్యం : వికారాబాద్ MLA మెతుకు ఆనంద్
Tags
# తెలంగాణ

About Subha Telangana
తెలంగాణ
Tags
తెలంగాణ
Admin Details
Subha Telangana News