ఖమ్మం జిల్లాలో అందుబాటులోకి... 10వేల ర్యాపిడ్‌యాంటిజెన్‌ టెస్ట్‌కిట్స్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

ఖమ్మం జిల్లాలో అందుబాటులోకి... 10వేల ర్యాపిడ్‌యాంటిజెన్‌ టెస్ట్‌కిట్స్‌


ఖమ్మం,జూలై 20(శుభ తెలంగాణ): రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 10వేల ర్యాపిడ్‌యాంటిజెన్‌ టెస్ట్‌కిట్స్‌ అందుబాటులోకివచ్చాయి. ఈమేరకు సోమవారం గాంధీచౌక్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో నిర్వహించిన కోవిడ్‌-19 నిర్దారణ పరీక్షల కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారంభించారు. అవసరమైర వారికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహిం చనున్నట్టు ఈసందర్భంగా ఆయన తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, మున్సిపల్‌కమిషనర్‌ అనురాగ్‌ జయంతి తదితరులు పాల్గొన్నారు.