15 లక్షలకి చేరువలో భారత్ కరోనా కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

15 లక్షలకి చేరువలో భారత్ కరోనా కేసులు


న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 48,661 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14వేలకు చేరువలో ఉంది. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,85,522కి చేరింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,67,882 కాగా, మొత్తం 8,85,577 మంది ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో కరోనా బారిన పడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్ర స్థానంలో ఉంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,66,368 కాగా.. తమిళనాడులో 2,13,723, ఢిల్లీలో 1,30,606 కరోనా కేసులు నమోదయ్యాయి. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )