మరో 16 ఇంజనీరింగ్ కాలేజీల మూసివేత త్వరాలోనే జాబితా ప్రకటించనున్న జెఎన్టియూ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 25, 2020

మరో 16 ఇంజనీరింగ్ కాలేజీల మూసివేత త్వరాలోనే జాబితా ప్రకటించనున్న జెఎన్టియూ


హైదరాబాద్, జూలై 24(శుభ తెలంగాణ) కొన్నేళ్ళ క్రితం తెలంగాణలో కుప్పలుతెప్పలుగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. అయితే ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, బోధన సరిగా లేకపోవడం వల్ల కొన్నింటిని ప్రభుత్వం మూసివేసింది, తాజాగా తెలంగాణలో 16 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేయాలని నిర్ణయించింది. దీని వల్ల 3800 సీట్లు పైగా తగ్గిపోనున్నాయి. గత కొన్నేళ్ళుగా ఈ కాలేజీల్లో చాలా తక్కువస్థాయిలో అడ్మిషన్లు జరిగాయని జెఎన్టీయూ హెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈ కాలేజీలన్నీ వివిధ జిల్లాల్లో వున్నాయని ఆయన అన్నారు. అడ్మిషన్లు లేకపోవడం వల్ల ఈ కాలేజీ ల నిర్వహణకు యాజమాన్యాలకు తలకుమించిన భారంగా మారింది దీనికితోడు ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా ఆలస్యంగా రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ దృష్టికి తెచ్చాయన్నా రు. కరోనా వైరస్ కారణంగా కాలేజీలను పరిశీలించాల్సి వుందన్నా రు, వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో వసతుల గురించి ఫిర్యాదులు వచ్చాయని, కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత మాత్ర మే కాలేజీలు తెరిచేందుకు అనుమతులు ఇస్తామన్నారు. మూసివేసే కాలేజీలకు సంబంధించి అడ్మిషన్ల పక్రియ వుండదన్నారు. అంతేకా దు మూసివేయనున్న కాలేజీ క్యాంపస్ లను హాస్టళ్ళు, పెయింగ్ గెస్ట్ రూంలుగా మార్చనున్నారు. అద్దెకు తీసుకున్న భవనాలను తిరిగి యజమానులకు అప్పగించనున్నారు. ఈ మూసివేయనున్న కాలేజీల జాబితాను జేఎన్టీయూహెచ్ త్వరలో ప్రకటించనుంది.

Post Top Ad