1850 పాజిటివ్ కేసులు నమోదు, ఐదుగురి మృతి, గ్రేటర్ పరిధిలో 1500 పైచిలుకు పాజిటివ్ కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 05, 2020

1850 పాజిటివ్ కేసులు నమోదు, ఐదుగురి మృతి, గ్రేటర్ పరిధిలో 1500 పైచిలుకు పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 1500 పైచిలుకు కేసులు నమోదవుతూ గుండేల్లో గుబులు రేపుతోన్నాయి. శనివారం కూడా 1850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ సోకిన ఐదుగురు శనివారం చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 288కి చేరింది. 1850 పాజిటివ్ కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 22 వేల 312కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 487 మందికి చికిత్స అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. శనివారం 1572 కేసులు రికార్డయి.. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. రంగారెడ్డిలో 92, మేడ్చల్-53, కరీంనగర్-18, వరంగల్ అర్బన్-31, నల్గొండ-10, నిజామాబాద్-17 కేసులు నమోదయ్యాయి. శనివారం 1342 మంది డిశ్చార్జయ్యారు. దీంతో ఇప్పటివరకు ఇంటికి వెళ్లిపోయిన వారి సంఖ్య 11 వేల 537గా ఉంది.