ఇక 18 ఏళ్ళ వరకు... నిర్ణంద విద్య! - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

ఇక 18 ఏళ్ళ వరకు... నిర్ణంద విద్య!


దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో వినూత్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్యను కేంద్రం తప్పనిసరి చేసింది. విద్యార్థులపై కరికులమ్‌ భారం తగ్గిం చాలనేది నూతన విధానం ఉద్దేశమని స్పష్టం చేసింది. 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బహు భాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలి పింది. ఈ మేరకు విద్యావిధానంలో మార్పు మంత్రి జవదేకర్‌ మోడియాకు వెల్లడించారు. ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలు తీసుకు వచ్చేం దుకు తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానం - 2020కి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రసారశాఖ మంత్రి ప్రకాళ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ 21వ శాతాబ్దపు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యతన జరిగినసమావేశం లో ఆమోద్ర వేసినట్లు చెప్పారు. 34 ఏళ్లుగా విద్యా విధానంలో ఎలాం టి మార్పులు ి గుర్తు చేశారు. దీన్ని మొత్తం సమాజం, దేశం, ప్రపంచ విద్యావేత్తలు స్వాగతిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఇది చరిత్రాత్మకమైన రోజని, 34 ఏళ్ల తర్వాత దేశంలో నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) వచ్చిందని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే తెలిపారు. "నూతన విద్యా విధానం, సంస్కరణల అనంతరం 2035 నాటికి 50 శాతం స్టూల ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌)ను సాధిస్తామని పేర్కొన్నారు. ఎన్‌ఈపీలో సంస్థల కోసం గ్రేడింగ్‌ చేయబడ్డ విద్యా, అడ్మినిస్ట్రేటివ్‌, ఫైనాన్నియల్‌ స్వయం ప్రతిపత్తి, ఉన్నత కోసం ఒకే రెగ్యులేటర్‌, అనేక 'తనిఖీల” స్థానంలో అనుమతుల కోసం స్వీయ వెల్లడి ఆధారిత పారదర్శక వ్యవస్థ కింద పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 'మన దేశంలో 45వేల అనుబంధ కళాశాలలు ఉ న్నాయని, గ్రేడెడ్‌ స్వయం ప్రతిపత్తి కింద, అకడమిక్‌, అద్మినిస్టేట్రివ్‌, ఫైనాన్షియల్‌ స్వయం ప్రతిపత్తి వారి అక్రిడిటేషన్‌ స్టేటస్‌ ఆధారంగా కాలేజీలకు ఇవ్వబడుతుందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ఈ-కోర్సులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వర్చువల్‌ ల్యాబ్‌లను అభివృద్ధి చేసి నేషనల్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ ఫోరం (నెట్‌ ఎఫ్‌) రూపొందిస్తున్నట్లు ఖరే వివరించారు. ఎన్‌ఈపీ 2020 రూపకల్పనలో విసృత ల్సు పక్రియను అవలంభించామని తెలిపారు. మొత్తం 2. 5లక్షల గ్రామ పంచాయతీ లను ఆన్‌లైన్‌ వేదిక ద్వారా సంప్రదించామని, ప్రభుత్వాలు, డిపార్ట్‌ మెంట్లు, విద్యావేత్తలు, సామాన్య ప్రజల అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న విధానంలో కేంద్రం భారీ మార్పు లు తీసుకువచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ్రకారం...ప్రస్తుతం ఉన్న 10 ప్లస్‌ 2 ప్లస్‌ ౩ అంటే పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ విధానాన్ని 5ప్లస్‌ 3ప్లస్‌ ౩ప్లస్‌ 4 మర్చారు. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్‌ అమలు చేయనున్నారు. కొత్త విధానంలో ఇంటర్‌ విద్యను రద్దు చేసి... డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌ కరికులమ్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆరో తరగతి నుంచే వాకేషన్‌ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్‌ నేర్పే ప్రయత్నం చేయనున్నారు. కాగా, ప్రస్తుతం ఉ న్న జాతీయ విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1992లో దాన్ని సవరించారు. కాగా, బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.

Post Top Ad