కొవిడ్‌-19 కట్టడిపై ప్రధాని మోదీ సమీక్ష : పాల్గొన్న తనుగుల జితేందర్‌ రావు యూనిటీ ఆఫ్‌ ప్రెస్‌ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

కొవిడ్‌-19 కట్టడిపై ప్రధాని మోదీ సమీక్ష : పాల్గొన్న తనుగుల జితేందర్‌ రావు యూనిటీ ఆఫ్‌ ప్రెస్‌ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి


ఢిల్లీ : కొవిడ్‌-19 కట్టడిపై ప్రధాని మోదీ శనివారం సమీక్షించారు. కరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగేలా విసృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. కరోనాని సమర్థంగా కట్టడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర స్థానిక అధికారులను ప్రశంసించారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక ప్రవర్తన బాగుండాలని, ఎవరికీ వైరస్‌ సంక్రమించకుండా కఠిన చర్యలు కొనసాగించాలన్నా రు. దిల్లీలో కరోనాని సమర్ధంగా కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర స్థానిక వర్గాలను ప్రధాని ప్రశంసించారు. ఎన్‌సీఆర్‌ ప్రాంతమంతా ఇదే విధానం అమలు చేయాలని సూచించారు. అహ్మదాబాద్‌లో ఇంటీ వద్దనే బాధితులను పర్యవేక్షించడం, వైద్యం అందించే “ధన్వంతరి రథ్‌” గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అహ్మదాబాద్‌లో విజయ వంతమైన “ధన్వంతరి రథ్‌' కార్యక్రమాన్ని అంతటా అమలు చేస్తే బాగుంటుందని అన్నారు. అత్యధిక పాజిటివ్‌ రేటు నమోదవుతున్న రాష్ర్టాలపై జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు మోదీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, వైద్యారోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్‌, నీతి ఆయోగ్‌ సభ్యులు, ఎన్‌.వి. సుభాష్‌ బిజెపి స్పోక్స్‌ పర్సన్‌ తెలంగాణ, తనుగుల జితేందర్‌ రావు యూనిటీ ఆఫ్‌ ప్రెస్‌ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.