1924 పాజిటివ్ కేసులు నమోదు, గ్రేటర్ పరిధిలో 1590 పాజిటివ్ కేసులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

1924 పాజిటివ్ కేసులు నమోదు, గ్రేటర్ పరిధిలో 1590 పాజిటివ్ కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు టాప్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. నిన్న 1879 పాజిటివ్ కేసులు రికార్డు కాగా.. ఇవాళ ఆ సంఖ్య 1924కి చేరింది. 2 వేల కేసులకు అడుగుదూరంలో నిలిచింది. గత 24 గంటల్లో 6 వేల 363 మంది నుంచి రక్త నమూనాలను సేకరించగా.. 1924 మందికి వైరస్ సోంది. 4 వేల 439 మందికి నెగిటివ్ వచ్చింది. వైరస్ తగ్గడంతో 992 మందిని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో డిశ్చార్జ్ అయిన మొత్తం రోగుల సంఖ్య 17 వేల 279కి చేరింది.
బుధవారం కరోనా వైరస్‌తో 11 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 324కి చేరింది. గ్రేటర్ పరిధిలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 1590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న హైదరాబాద్‌లో 1422 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇవాళ 1500 మార్క్ దాటింది. రంగారెడ్డిలో 99 పాజిటివ్ కేసులు, మేడ్చల్ 43, వరంగల్ అర్బన్ 26, సంగారెడ్డి 20, మహబూబ్ నగర్ 15, నిజామాబాద్‌లో 19, కరీంనగర్ 14, నల్గొండ 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.