ఓసి2 డోజర్ సెక్షన్లో కరోనా వైరస్ నివారణపై అవగాహన సదస్సు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

ఓసి2 డోజర్ సెక్షన్లో కరోనా వైరస్ నివారణపై అవగాహన సదస్సు


మణుగూరు(శుభ తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణు గూరు సింగరేణి ఏరియాలో కరోనా వైరస్ నివారణ పట్ల ముఖా నికి మాస్కులతో భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహిస్తూ స్వీయ రక్షణ తో ముందుకు సాగాలని పీకే ఓసి2 డేస్ వర్క్ షాప్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలీషా డోజర్ సెక్షను ఉద్యోగులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా వైరస్ వల్ల సగటు మానవుని జీవితం అల్లకల్లోలం అవుతున్న తరుణంలో అత్యంత ధైర్యసాహసాలతో సింగ రేణిలోపనిచేస్తున్న ఉద్యోగులు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం లో డోజర్ సెక్షన్ ఇంజనీర్ అభిషేక్, గుర్తింపు సంఘం నాయకులు సిహెచ్ అశోక్, ఫోరమెన్ పి.భాస్కరరావు,శంకర్, ఉద్యోగులు రమణ గురుమూర్తి, సిహెచ్ కోటేశ్వరరావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు