20 మంది ప్రగతి భవన్ సెక్యూరిటీకి కరోనా పాజిటివ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 04, 2020

20 మంది ప్రగతి భవన్ సెక్యూరిటీకి కరోనా పాజిటివ్


విశ్వనగరి భాగ్యనగరంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం 998 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. అయితే ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. గత వారం రోజుల నుంచి విధులు నిర్వహిస్తున్న 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. వీంతా ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది అని అధికారులు తెలిపారు. కానీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రావడం చర్చకు దారితీసింది.20 మందికి వైరస్ సోకిందని తెలిసి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రగతి భవన్‌ను శానిటైజ్ చేశారు. అయితే ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ లేరు. ఆయన తన ఫామ్ హౌస్ ఎర్రవెల్లిలోనే ఉంటున్నారు. సీఎం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రగతి భవన్ మొత్తం శానిటైజ్ చేశారు. మరోవైపు గ్రేటర్ పరిధిలో కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదు అని భావించి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. లేదంటే ఈపాటికే లాక్ డౌన్‌పై నిర్ణయం వెలువడేది.