రూ.200 కోట్లు ఏమ్మయ్యాయి అని ప్రశ్నిస్తే ... ఎంపీ ధర్మపురి అరవింద్‌ దాడి ...? - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 13, 2020

రూ.200 కోట్లు ఏమ్మయ్యాయి అని ప్రశ్నిస్తే ... ఎంపీ ధర్మపురి అరవింద్‌ దాడి ...?శుభ తెలంగాణ , వరంగల్ : ‌ నగరంలో ఉన్న ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భూ కబ్జాదారులని ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఆరోపించారు. వరంగల్‌ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌ల భూ ఆక్రమణలపై తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు. కేంద్రం వివిధ పథకాల కింద వరంగల్‌కు కేటాయించిన రూ.200 కోట్లు ఏమయ్యాయో చెప్పాలని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆరుగురిపై సుబేదారి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అరవింద్‌ హన్మకొండ హంటర్‌రోడ్డులోని వేద బాంక్వెట్‌ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్‌ నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై ఘాటైన ఆరోపణలు చేశారు. వారు భూకబ్జాదారులని ఆరోపించారు. ఎంపీ తన వరంగల్‌ పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వచ్చారు.