2023 వరకు అధ్యక్ష పదవిలో గంగూలీ...? - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

2023 వరకు అధ్యక్ష పదవిలో గంగూలీ...?


బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అండగా నిలిచారు. మరో మూడేళ్లు గంగూలీనే బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత గంగూలీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, అవి క్రికెట్‌కు ఎంతో తోడ్పాటునందించాయని గవాస్కర్ పేర్కొన్నారు. 'అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ద్రావిడ్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్‌గా నియమించి తన మార్క్ పరిపాలనను పరిచయం చేశాడు. దేశంలోనే మొదటిసారి పింక్ బాల్ టెస్ట్(డే అండ్ నైట్) నిర్వహించేందుకు గంగూలీనే కారణమ'ని గవాస్కర్ అభిప్రాయపడ్డరు. అంతేకాకుండా 2023 వరకు అధ్యక్ష పదవిలో గంగూలీనే కొనసాగితే బోర్డు మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )