టీ20 వరల్డ్‌కప్ జరుగుతుండ లేదా అని తేలేది నేడే ...! - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 20, 2020

టీ20 వరల్డ్‌కప్ జరుగుతుండ లేదా అని తేలేది నేడే ...!


ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ భవితవ్యంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం తుది నిర్ణయం ప్రకటించబోతోంది. ఈరోజు మధ్యాహ్నంపైన ఐసీసీ బోర్డు మీటింగ్ జరగనుండగా.. అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో చర్చించిన తర్వాత టీ20 వరల్డ్‌కప్‌పై ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఆ టోర్నీ వాయిదా పడబోతోంది. వాస్తవానికి ఆస్ట్రేలియా గత ఏప్రిల్‌లోనే టీ20 వరల్డ్‌కప్‌కి తాము ఆతిథ్యమివ్వలేమని తేల్చి చెప్పేసింది. కానీ.. ఐసీసీ మాత్రం టీ20 వరల్డ్‌కప్ వాయిదా నిర్ణయంపై నాన్చుడి ధోరణిలో వ్యవహరిస్తోంది. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడితే ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్‌ని నిర్వహించుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తోంది. దాంతో.. బీసీసీఐని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే ఐసీసీ అలా నాన్చుడి ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ని వాయిదా వేసి..

ఆ టోర్నీని 2022లో నిర్వహించాలని ఐసీసీ ఆలోచన. ఇక 2021 టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు భారత్ వద్ద ఉండగా.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య అవకాశం తమకి ఇవ్వాలని ఇటీవల ఆస్ట్రేలియా పావులు కదపింది. కానీ.. భారత్ మాత్రం ఆ ప్రతిపాదనని తిరస్కరించింది. 2023లో వన్డే ప్రపంచకప్‌కి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుండటంతో.. 2022, 2023లో బ్యాక్ టు బ్యాక్ వరల్డ్‌కప్‌లు నిర్వహించడం కష్టమని బీసీసీఐ భావిస్తోంది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )