22 నుంచి 26 వరకు పుస్తకాల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

22 నుంచి 26 వరకు పుస్తకాల పంపిణీ


రంగారెడ్డి జూలై21(శుభ తెలంగాణ): పాఠ్య పుస్తకాల పంపిణీలో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో రూ.30 లక్షల రూపాయల జడ్పీ నిధులతో నిర్మించనున్న అండర్‌ గ్రౌండ్‌ డైనేజీ పనులకు జడ్బీ చైర్‌ పర్సన్‌ తీగల అనిత హరనాథ్‌ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... రేపటి నుంచి ప్రారంభం అయ్యే పాఠ్య పుస్తకాల పంపిణీలో శాసనసభ్యులు, ఎంపీలు, జడ్పీ చైర్‌ పర్సన్‌ లు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్‌ లు ఎంపీటీసీలు, సహకార సొసైటీ చైర్మన్‌ లు, విద్యా కమిటీ చైర్మన్‌ లు సభ్యులు పాల్గొని పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే పంపిణీ కోసం ఇప్పటికే పుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు, విద్యా కమిటీ లకు అప్పజెప్పినట్లు వివరించారు. పంపిణీ ని కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేపట్టాలని మంత్రి తెలిపారు. విద్యార్థుల తలిదండ్రులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. (గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, ప్రతి నెల 339 కోట్ల నిధులు నేరుగా పంచాయతీ లకు విడుదల చేస్తున్నారన్నారు. ప్రణాళిక బద్ధంగా (గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. హరితహారం సందర్భంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటినట్లు మంత్రి వివరించారు. అంతకు ముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి , జద్బీటీసీ మాలతి కృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ శివ ప్రసాద్‌, సర్పంచ్‌ గాయత్రి, ఎంపీటీసీ సుజాత తదితరులు పాల్గొన్నారు.