4 వేల గ్రామాల్లో తాటి, ఈత వనాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 05, 2020

4 వేల గ్రామాల్లో తాటి, ఈత వనాలు

హరితహారంలో భాగంగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఒక్కో గ్రామ పంచాయతీలో వెయ్యి మొక్కల చొప్పున 4 వేల పంచాయతీల్లో తాటి, ఈత వనాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. ఈ మేరకు శనివారం ఎక్సైజ్‌శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో శ్రీనివాస్‌గౌడ్‌.. అధికారులకు హరితహారంపై దిశానిర్దేశం చేశారు. గ్రామ పరిధిలోని చెరువులు, కుంటలు, కాలువలు, ఇతర ప్రభుత్వ భూముల్లో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో తాటి, ఈత లేదా కర్జూర మొక్కలను నాటాలని సూచించారు. అనంతరం నీరాపాలసీపై శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్షించారు. సమీక్షలో ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, అదనపు కమిషనర్‌ అజయ్‌రావు, సహాయ డైరెక్టర్‌ హరికిషన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌వై ఖురేషి, ఈసీలు దత్తరాజ్‌గౌడ్‌, శీలం శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

సమిష్టి కృషితో అభివృద్ధి సాధ్యం 

మహబూబ్‌నగర్‌: సమిష్టిగా కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎక్సైజ్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎదిరకు చెందిన 200 మంది బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.